ఉద్యోగులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్: పౌరసేవలపై కీలక ఆదేశాలు జారీ
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులతో త్వరలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలో పౌరసేవలపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు అందించే సేవల్లో నాణ్యత పెంచేందుకు ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆన్లైన్ కోర్సులు వినియోగించుకుని సామర్థ్యం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాభిప్రాయంలో వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు.