చిన్నంపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషక మాసోత్సవ వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఓబులవారిపల్లి

ఓబులవారిపల్లి మండలం చిన్నంపల్లి హరిజనవాడ అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషక మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ గుణవతి హాజరై గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శిశు ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరిస్తూ చిన్నారులకు విధిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.