ఓట్ల తొలగింపు కుట్రలపై ప్రధాని మోదీపై రేవంత్ రెడ్డి నిప్పులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఢిల్లీ

బాబాసాహెబ్ అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కును తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుట్ర పన్నుతున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలపై కక్ష పెంచుకున్న మోదీ సర్కార్ ఓట్లను తొలగించేందుకు సీఈసీని అడ్డుపెట్టుకుందని మండిపడ్డారు. మోదీని గద్దె దించే వరకు విశ్రమించబోమని ఆయన స్పష్టం చేశారు.