ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ ఢీకొని ఇరవై మందికి గాయాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి హైస్కూల్ సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్ తో పాటు ఇరవై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.