మాతా శిశు సంరక్షణ సేవల్లో వెనుకబడిన నెల్లూరు జిల్లా

రిపోర్టర్: రాజేష్ స్థలం: నెల్లూరు

మాతా శిశు సంరక్షణ సేవలను అందించడంలో నెల్లూరు జిల్లా వెనుకబడిందని ఇటీవల విడుదలైన ఆర్సీహెచ్ పోర్టల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు, పౌష్టికాహారం అందించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో యాభై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇరవై ఎనిమిది పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదని, దీనివల్ల ప్రసవ సమయాల్లో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.