సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం కార్లో సజీవదహనమైన ప్రముఖ న్యూరో సర్జన్
రిపోర్టర్: మహేష్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కె. జగదీశ్ బాబు కార్లో సజీవదహనం అయ్యారు. ఖమ్మం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో ఆయన లోపలనే సజీవదహనమయ్యారు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.