ఖైరతాబాద్ వినాయక నిమజ్జనోత్సవంలో మహిళా పోలీసులతో ఎమ్మెల్యే దానం నాగేందర్ నృత్యం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ వినాయక నిమజ్జనోత్సవ వేడుకల సందర్భంగా అనర్హత వేటు ఎదుర్కొన్న ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ సినిమా పాటలకు మహిళా కానిస్టేబుళ్లతో కలిసి నృత్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయని స్వతంత్ర జర్నలిస్టు రేవతి వెల్లడించారు. విధి నిర్వహణలో ఉన్న యూనిఫామ్ ధరించిన మహిళా పోలీసులతో ఇలాంటి నృత్యాలు చేయించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియాలో రీల్స్ కోసం ప్రజా ప్రతివిధులు ఇలా వ్యవహరించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని ఆమె పేర్కొన్నారు.