ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రాణించాలి.. విద్యార్థులకు టై బెల్టు బ్యాడ్జీల పంపిణీ!
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానిక దంపతులు మన్నె మంజుల మరియు నరసింహారెడ్డి సుమారు 18 వేల రూపాయల విలువైన టై, బెల్టు, బ్యాడ్జీలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఏఏపీసీ చైర్పర్సన్ మునగాల అఖిల విద్యార్థులు పరిశుభ్రత పాటిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. అనంతరం దంపతులను ఘనంగా సన్మానించారు.