ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర భద్రతా లోపం, విదేశీయుల పరారీ

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తీవ్ర భద్రతా లోపం బయటపడింది. సరైన ఇమ్మిగ్రేషన్ అనుమతులు లేకుండానే ఇటలీకి చెందిన ముగ్గురు విదేశీయులు దేశం విడిచి వెళ్లిపోయారు. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ చేరుకున్న వీరు, ఇమ్మిగ్రేషన్ పూర్తి కాకుండానే లుఫ్తాన్సా విమానంలో మ్యునిచ్‌కు పలాయనం చిత్తగించారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్రంగా స్పందించిన కేంద్ర విమానయాన శాఖ ఎయిరిండియాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.