పుణెలో కార్నింగ్ నూతన ఆప్టికల్ కనెక్టివిటీ తయారీ కేంద్రం ప్రారంభం
రిపోర్టర్: నరేష్
స్థలం: Pune
మహారాష్ట్రలోని పుణెలో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ కార్నింగ్ తన నూతన ఆప్టికల్ కనెక్టివిటీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ ఎండీ సుధీర్ పిళ్లై తెలిపారు. దేశంలో డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా డేటా సెంటర్లు, టెలికాం నెట్వర్క్ల అవసరాలకు తగినట్లుగా ఆప్టికల్ ఫైబర్, కేబుల్స్ తదితర ఉత్పత్తులను సరఫరా చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.