క్రిస్మస్ బరిలో బాలకృష్ణ దాదా సినిమా: వాయిదా రూమర్లకు మేకర్స్ చెక్
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న దాదా సినిమా క్రిస్మస్ బరిలో విడుదల కానుందని మేకర్స్ స్పష్టం చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాకినాడ పోర్టులో జరిగిన యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య మోకాలికి గాయం కావడంతో షూటింగ్ కొద్ది రోజులు నిలిచిపోయినప్పటికీ, ప్రస్తుతం వేగంగా పనులు జరుగుతున్నాయని, త్వరలోనే మొదటి పాటను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.