విజయ్ దేవరకొండ రణబాలి సినిమా పవర్‌ఫుల్ టీజర్ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: భారతదేశం

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రణబాలి'. 1870 ల కాలంలో రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ వారిపై పోరాడే స్వతంత్ర పోరాటయోధుడిగా విజయ్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది.