విమాన ప్రయాణికులకు భారీ ఊరట: టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వ కీలక నిబంధనలు
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
విమాన ప్రయాణికులకు ఊరటనిచ్చేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త విమానయాన నిబంధనలను నోటిఫై చేసిందని అధికారులు తెలిపారు. అత్యవసర లేదా అసాధారణ పరిస్థితుల్ లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విమాన టికెట్ ధరల్ లో జోక్యం చేసుకునేలా ఈ నియమాలు ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. ఎయిర్లైన్స్ అన్నీ తమ నిర్వహణ వ్యయం ఆధారంగా టారిఫ్ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు సమర్పించడంతో పాటు వెబ్సైట్లలో పారదర్శకంగా ప్రచురించాలని నిబంధనలు స్పష్టం చేశాయి.