రోటిగూడ వంతెన పనుల ఆలస్యంపై భగ్గుమన్న స్థానికులు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం తీవ్రంగా ఆలస్యమవుతోంది. దీనిపై ఇటీవల ఎమ్మెల్యే బొజ్జు కూడా సమావేశంలో అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం లో లెవెల్ వంతెన మాత్రమే ఉండటంతో ప్రతి వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ స్థానికులు కోరుతున్నారు.