ఎమ్స్ నార్సెట్ పదకొండు ఫలితాలు విడుదల చేసిన న్యూఢిల్లీ ఎయిమ్స్

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నార్సెట్ పదకొండు రిక్రూట్‌మెంట్ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం లక్షా ఎనిమిది వందల నాలుగు మంది హాజరుకాగా వారిలో పన్నెండు వేల డెబ్బై రెండు మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వచ్చే సెప్టెంబర్ ముప్పైవ తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎయిమ్స్ వెల్లడించింది.