మర్యమ్ నవాజ్ కుమార్తె మహ్నూర్ సఫ్దర్ వివాహం ఘనంగా పూర్తి.
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ కుమార్తె మహ్నూర్ సఫ్దర్ వివాహం పారిశ్రామికవేత్త జాబ్బర్ ఖాల్ద్ కుమారుడు అజాన్ జాబ్బర్ తో లాహోర్ లోని జాతి ఉమ్రా నివాసంలో అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఈ నిఖా వేడుకకు కుటుంబ సభ్యులు మరియు కొద్దిమంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.