భారీ వరద నీటితో తాలిపేరు ప్రాజెక్టు పదిహేను గేట్లు ఎత్తివేత
రిపోర్టర్: కిరణ్
స్థలం: చర్ల
చర్ల మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో శుక్రవారం పదిహేను గేట్లు ఎత్తి అరవై ఐదు వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో డీఈ తిరుపతి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానిక వాగులు పొంగుతుండటంతో జలాశయానికి వరద ప్రవాహం మరింత హెచ్చింది.