నారమల్లి శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
తెలుగుదేశం పార్టీ నేత, నటుడు నారమల్లి శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. ఆయన తన బాల్యమిత్రుడని, మంత్రిగా మరియు ఎంపీగా ప్రజలకు విశేష సేవలందించారని గుర్తు చేసుకున్నారు. ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, కళారంగంలో చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొంటూ శివప్రసాద్ జ్ఞాపకాలు ఎప్పటికీ తన హృదయంలో నిలిచిపోతాయని సీఎం చంద్రబాబు భావోద్వేగంతో తెలిపారు.