ట్రంప్ హెచ్చరికలపై బాలకృష్ణ సినిమా క్లిప్‌తో ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర హెచ్చరికలకు ప్రతిగా ఇరాన్ దేశం టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలోని యాక్షన్ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఈ వీడియోను షేర్ చేస్తూ, తమ దేశం రక్షణ లేనిది కాదని స్పష్టం చేసింది. అయితే ఆ చిత్రానికి బాలీవుడ్ అని పొరపాటుగా పేర్కొనడంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.