తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ బాధ్యతల నుంచి మీనాక్షి నటరాజన్ తప్పుకునే అవకాశం
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ త్వరలోనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరో రెండు నెలలు మాత్రమే ఆమె ఇంచార్జ్‌గా కొనసాగనున్నారు. ఆమె స్థానంలో ముకుల్ వాస్నిక్ లేదా తమిళనాడుకు చెందిన సీనియర్ నేతను నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది.