ఉద్యోగుల సమస్యలపై రేపు సీఎం చంద్రబాబు కీలక భేటీ!
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ మరియు బకాయిల అంశంపై రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాల నేతలతో ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆందోళనలు, పెండింగ్ డిమాండ్లపై ఈ భేటీలో స్పష్టమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.