రోజా వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే: కూటమి సర్కార్పై విమర్శలను తిప్పికొట్టిన గాలి భానుప్రకాష్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తిరుపతి అర్బన్

నగరిలో వైసిపి నేత రోజా తీరుపై ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె నోరు పారేసుకుంటున్న తీరును మహిళలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. వైసిపి హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, లక్ష కోట్లతో రాయలసీమను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.