రాజస్థాన్ గురుద్వారాపై పోలీసుల దాడి: నిష్పాక్షిక విచారణకు అకల్ తఖ్త్ జేతేదార్ డిమాండ్

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీ గంగానగర్

శ్రీ గంగానగర్లోని గురుద్వారాలో రాజస్థాన్ పోలీసులు జరిపిన దాడిపై నిష్పాక్షిక విచారణ జరపాలని అకల్ తఖ్త్ జేతేదార్ గియాని కుల్దీప్ సింగ్ గర్జాజ్ డిమాండ్ చేశారు. అరెస్టయిన సిఖ్ నేత తేజిందర్ పాల్ సింగ్ను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. గురుద్వారా పవిత్రతను దెబ్బతీసేలా పోలీసులు వ్యవహరించడం అత్యంత ఖండనార్హమని గర్జాజ్ స్పష్టం చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాజస్థాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.