గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలంటూ సర్పంచ్ బీసు ధనలక్ష్మి పిలుపు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్ గర్భిణీలు ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తల్లులకు అవగాహన కల్పించడంతో పాటు చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో మోత్కూరు సీడీపీవో నాజీ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.