వైద్య రంగంలో ఏఐ విప్లవం: మెడ్టెక్ ఛాలెంజ్ 2.0 నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అందిపుచ్చుకుని పేదలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నిర్వహించిన మెడ్టెక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సత్ఫలితాలు ఇవ్వడంతో త్వరలో మెడ్టెక్ ఛాలెంజ్ 2.0 నిర్వహణకు వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలతో త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వైద్య వర్గాలు స్పష్టం చేశాయి.