తిరుమల భక్తులకు తీపి కబురు: విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు

రిపోర్టర్: రాము స్థలం: Tirupati

తిరుమల గరుడ సేవ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను ప్రకటించిందని అధికారులు తెలిపారు. ఈ నెల పదిహేడో తేదీ నుంచి ఇరవై వరకు మొత్తం ఎనిమిది ట్రిప్పుల ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని, సాధారణ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు వెల్లడించారు.