బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: బొబ్బిలి

బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్లపల్లి సాయికృష్ణ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రామభద్రపురంలో గణేష్ ఉత్సవాల సామగ్రికి అడ్వాన్స్ ఇచ్చి ద్విచక్రవాహనంపై వస్తుండగా గోతిలో పడి ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సైలు లోవరాజు, కొండలరావు తెలిపారు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న సాయికృష్ణ మృతితో తల్లిదండ్రులు రామారావు, దాడమ్మలు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే బేబినాయన బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు.