మచిలీపట్నం కర్నూలు మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసు
రిపోర్టర్: హరి
స్థలం: విజయవాడ
మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ వరకు కొత్త ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రూట్ లో వారానికి మూడు రోజుల పాటు ఈ రైలును నడపాలని నిర్ణయించారు. ఈ కొత్త రైలు అందుబాటులోకి రావడం వల్ల కృష్ణా, గుంటూరు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది.