విమాన టికెట్ రీఫండ్ నిరాకరణ: వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: చండీగఢ్
విమాన టికెట్ రద్దు చేసినప్పటికీ రీఫండ్ ఇవ్వని సంస్థలకు వినియోగదారుల కమిషన్ గట్టి షాకిచ్చింది. చండీగఢ్ కు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడి ప్రయాణం కోసం బుక్ చేసిన టికెట్లను రద్దు చేసుకున్నాడు. అయితే డబ్బులు వెనక్ కి ఇవ్వడానికి యాత్రా ఆన్ లైన్, ఎయిర్ కెనడా, ఎతిహాద్ ఎయిర్ వేస్ సంస్థలు నిరాకరించాయి. దీనిపై బాధితుడు కన్స్యూమర్ కమిషన్ ను ఆశ్రయించగా, రూ. 70,878 రీఫండ్ తో పాటు నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.