ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీ తొలగింపులు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ ఆరోపణ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. వివిధ రాష్ట్రాల్లో అణగారిన వర్గాలకు చెందిన భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రేరేపితంగానే ఈ ఓటర్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోందని ఆరోపించిన ఆయన, ఇది రాజ్యాంగంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు.