అరేబియా సముద్రంలో రూ.3 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh / Arabian Sea
అరేబియా సముద్రంపై నౌక ద్వారా తరలిస్తున్న సుమారు మూడు వేల కోట్ల రూపాయల విలువైన ఐదువందల ఇరవై ఆరు కేజీల హెరాయిన్ను పట్టుకున్న భారతీయ కోస్ట్ గార్డ్ అధికారులను బీజేపీ ఆంధ్రప్రదేశ్ విభాగం అభినందించింది. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మారుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేసిన వంద గంటల్లోనే భారీ ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడటం ఆయన సంకల్పానికి నిదర్శనమని పేర్కొంది. ఈ అసాధారణ ఆపరేషన్ నిర్వహించిన భద్రతా బలగాల సమర్థతను ప్రశంసించింది.