తెలంగాణలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
ప్రజా పాలన దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల స్మృతులను ఈ సందర్భంగా ఆయన ఘనంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాట చారిత్రక ప్రాధాన్యతను గుర్తుచేస్తూ రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య వ్యవస్థకు మారిన గొప్ప చారిత్రక సందర్భమే సెప్టెంబర్ 17 అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.