పెళ్లి పేరుతో గిరిజన యువతి మోసం: న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: భామిని
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, గర్భవతిని చేసినా పట్టించుకోవడం లేదని మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన యువతి బత్తిలి పోలీసులను ఆశ్రయించారు. విద్యాశాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి అయిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ విఫలమవడంతో స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఎస్సై అందుబాటులో లేకపోవడంతో మంగళవారం రావాలని సిబ్బంది సూచించారు.