నెల్లూరులో రూ.380 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
నెల్లూరు జిల్లాలో రూ.380 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న 62 అభివృద్ధి పనులకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఇందులో నెల్లూరు కార్పొరేషన్లో రూ.240 కోట్లు, కావలి, గూడూరు, ఆత్మకూరు, బుచ్చి, అల్లూరు మున్సిపాలిటీల్లో రూ.140 కోట్లతో HAM మోడల్లో రోడ్లు, సెంట్రల్ మీడియన్లు, లైటింగ్, డ్రెయిన్లు, పార్కులు నిర్మించనున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.