ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన కుమార్తె
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట ఎస్సీ కాలనీలో ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపై కుమార్తె, అల్లుడు దాడికి పాల్పడి ఇంటి నుండి వెళ్లగొట్టారు. బాధితులు మెట్టుపల్లి సుజాత, యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం జూలై 16న నిందితులు మద్యం మత్తులో వచ్చి దాడి చేశారు. ప్రాణభయంతో వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లు ఆక్రమించారని, బంగారం మరియు ఆస్తి పత్రాలు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.