చౌటుప్పల్ మూడో వార్డులో ఘనంగా బతుకమ్మ సంబరాలు: ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగ సంబరాలు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో అత్యంత వైభవంగా జరిగాయి. ఎంగిలిపూల బతుకమ్మ తొలి రోజు వేడుకల్లో భాగంగా స్థానిక మహిళలు పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో భాజపా మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ అందరిలోనూ నూతనోత్సాహాన్ని నింపారు. ఈ సాంస్కృతిక వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు.