ఆరోగ్యానికి ముప్పు: థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండాలంటే సోయా ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్స్, బ్రోకలీ వంటి కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటమో లేదా తగ్గించడమో చేయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తగిన పోషకాహారం తీసుకోవడంతో పాటు జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యలను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.