భారత్, న్యూజిలాండ్ తొలి నావికా విన్యాసాలకు రంగం సిద్ధం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విశాఖపట్నం
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య తొలి ద్వైపాక్షిక నావికా విన్యాసాలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. రక్షణ సంబంధిత సముద్ర సహకారంలో భాగంగా న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణస్వామినాథన్, ఆ దేశ నేవీ చీఫ్ రియర్ అడ్మిరల్ గారిన్ గోల్డింగ్‌తో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న ఈ విన్యాసాలతో పాటు సమాచార మార్పిడి, నావికుల శిక్షణ అంశాలపై చర్చించారు.