టీ20 సిరీస్ కైవసం కోసం భారత్ పోరు: జట్టులో కీలక మార్పులు చేసిన కివీస్
రిపోర్టర్: శివ
స్థలం: వెల్లింగ్టన్
స్వదేశంలో భారత్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు, సిరీస్ లో నిలిచేందుకు కీలక మార్పులు చేపట్టింది. గాయాల కారణంగా మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ వంటి ప్రముఖ బౌలర్లు దూరమవడంతో బ్లెయిర్ టిక్నర్, జోష్ క్లార్క్సన్ లను ఎంపిక చేసినట్లు కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. పనిభారాన్ని తగ్గించేందుకే రొటేషన్ పద్ధతి పాటిస్తున్నామని వెల్లడించారు.