ప్రకృతి పరిరక్షణకు నడుంబిగించి మట్టి ప్రతిమలను పంపిణీ చేసిన నాయకులు
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో దాతలు, సభ్యుల సహకారంతో బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో నిర్వహించిన ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి ముఖ్యఅతిథులుగా హాజరై భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని, మట్టి ప్రతిమలతోనే ప్రకృతిని కాపాడుకోవచ్చని తెలిపారు.