ఆర్చరీ ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించిన ధీరజ్‌ బొమ్మదేవర

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్లో పురుషుల రికర్వ్‌ స్వర్ణం సాధించి ధీరజ్‌ బొమ్మదేవర చరిత్ర సృష్టించాడు. షూటాఫ్‌లో జపాన్‌కు చెందిన నకానిషిపై విజయం సాధించి తొలి భారత పురుష ఆర్చర్‌గా ఘనతకెక్కాడు. ఈ చారిత్రాత్మక విజయంతో భారతావని గర్వపడేలా చేశాడంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ అభినందించారు. విజయవాడ ఆర్చరీ గ్రౌండ్స్ నుంచి మెక్సికో ప్రపంచ వేదిక వరకు ధీరజ్ అద్భుత ప్రస్థానం సాగించారన్నారు.