ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రభుత్వంపై మండిపడిన హరీశ్‌రావు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను భారీగా పెంచడంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పి పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమన్నారు. పెంచిన అడ్డగోలు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.