కాంగ్రెస్ పాలనపై బీజేపీ తెలంగాణ విమర్శలు: వంద రోజుల్లో చర్యలంటూ మోసం

రిపోర్టర్: రమేష్ స్థలం: Telangana

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే బీఆర్ఎస్ నాయకులను జైల్లో పెడతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, వెయ్యి రోజులు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ తెలంగాణ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. పరస్పర ఆరోపణలకే పరిమితమైన ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టడం లేదని మండిపడింది. కనీసం రబీ సీజన్ నాటికైనా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన ప్రీమియం అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.