మున్సిపల్ ఎన్నికలు: ఈ నెల 9న వైస్ చైర్మన్ల ఎన్నిక
రిపోర్టర్: శివ
స్థలం: చిత్తూరు
చిత్తూరు నగర కార్పొరేషన్ తో పాటు పలమనేరు, నగరి మున్సిపాలిటీలలో ఈ నెల 9వ తేదీన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.