కోదాడలో ఘనంగా మెగా జాబ్ మేళా

రిపోర్టర్: కృష్ణ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి స్కూల్‌లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన లభించింది. సుమారు 300కు పైగా కంపెనీలు పాల్గొన్న ఈ మేళాను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది అభ్యర్థులు తరలిరావడంతో నిర్వాహకులు ప్రత్యేక కౌంటర్లు, ఆర్టీసి ప్రత్యేక ఆటోలు ఏర్పాటు చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.