భారత్‌తో టీ20 సిరీస్‌కు రచిన్ రవీంద్ర దూరం
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
ఆక్లాండ్‌లో జరిగిన ప్రమోషనల్ షూట్‌లో గాయపడిన న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర, భారత్‌తో తలపడనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. డైవింగ్ క్యాచ్ పట్టే ప్రయత్నంలో అతని కుడి భుజానికి గాయమైంది. రాబోయే టెస్ట్ మ్యాచ్‌ల షెడ్యూల్ దృష్ట్యా వైద్యుల సలహా మేరకు అతన్ని తొందరగా బరిలోకి దించకూడదని కివీస్ బోర్డు నిర్ణయించింది.