తీవ్ర వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో ఎడతెరిపిలేని భారీ వర్షాలు

రిపోర్టర్: హరి స్థలం: చీపురుపల్లి

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బుధవారం రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా స్థానిక పరిసరాలు పూర్తిగా జలమయం అయ్యాయి. భారీ గాలుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందుజాగ్రత్త చర్యగా రాత్రి నుంచే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.