కర్ణాటక అసెంబ్లీలో వందేమాతరం గేయంపై బీజేపీ సభ్యుల నిరసన
రిపోర్టర్: అశోక్
స్థలం: కర్ణాటక
కర్ణాటక అసెంబ్లీలో వందేమాతరం ఆలపించడాన్ని కేవలం రెండు చరణాలకే పరిమితం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు పూర్తి గీతాన్ని ఆలపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఎస్.ఆర్. విశ్వనాథ్ తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ విధానసౌధలో తాము పూర్తి వందేమాతరం పాటను పాడతామని బీజేపీ సభ్యులు తేల్చిచెప్పారు.