వెంకటాచలంలో పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా కొవ్వొత్తుల ర్యాలీ
రిపోర్టర్: సాయి దివ్య
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం సీహెచ్సీ సెంటర్లో పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు, విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేసి పోలీసు విధులను వివరించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినట్లు సీఐ కె. అంకమ్మ తెలిపారు.