'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్': జావా మోటార్ సైకిల్ గెలుచుకున్న స్టావ్రౌలా

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బెంగళూరు

గ్లోబల్ చెస్ లీగ్ నాలుగో ఎడిషన్‌లో గాంజెస్ గ్రాండ్ మాస్టర్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన గ్రీక్ చెస్ సంచలనం స్టావ్రౌలా సోలాకిడౌ జట్టును విజేతగా నిలిపి చరిత్ర సృష్టించారు. బెంగళూరులో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆటతీరుతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును దక్కించుకున్న ఆమె, ప్రతిష్టాత్మక ‘జావా ఆల్ స్టార్స్ 42 సిల్వర్ నైట్’ బాబర్ మోటార్ సైకిల్‌ను సొంతం చేసుకున్న తొలి విజేతగా నిలిచారు.